Wednesday, August 13, 2025

War 2 Movie Review - వార్ 2 మూవీ రివ్యూ

 

War 2 Movie Review: వార్ 2 మూవీ రివ్యూ 




నటీనటులు: 

జూనియర్ ఎన్టీఆర

హృతిక్ రోషన్

అనిల్ కపూర్

కియారా అద్వానీ

అశుతోష్ రాణా తదితరులు దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ 

కథనిర్మాత: ఆదిత్య చోప్రా

 డైలాగ్స్: అబ్బాస్ టైర్‌వాలా 

స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్ 

సినిమాటోగ్రఫి: బెంజమిన్ జాస్పర్ 

ఎడిటింగ్: ఆరీఫ్ షేక్ 

మ్యూజిక్: ప్రీతమ్ (బీజీఎం), సంచిత్, అంకిత్ బల్హారా (పాటలు) 

బ్యానర్: యష రాజ్ ఫిల్మ్స్ రిలీజ్


స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యశ్ రాజ్ ఫిల్మ్స్. బాలీవుడ్‌లోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో నిర్మించిన సినిమాలు యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రమే వార్ 2. ఇద్దరు పవర్ హౌస్‌ లాంటి హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లను అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు? ఈ సినిమా ఎలా ఉంది? వార్ 2 కథేంటీ? ప్రేక్షకులను వార్ 2 మెప్పించిందా? లేదా? చూస్తే.


వార్ 2 కథేంటీ? 

మాజీ రా ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) వరుసపెట్టి బడా బాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)ని కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం రా, భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతనిని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) నాయకత్వం వహిస్తాడు. తండ్రిని చంపిన కబీర్‌పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) పగతో రగిలిపోతుంది. తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. రా ఏజెంట్‌గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్‌కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటీ? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది? అనేది వార్ 2 కథ




ఎవరెలా చేశారు? యశ్ రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్సన్ సీన్స్, చేజింగ్‌లు నిండిపోయాయి. టీజర్, ట్రైలర్లలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ ఇచ్చారు. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటీ? అనేది దర్శకుడు రివీల్ చేశాడు. జపాన్‌లో కథ మొదలై ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఎంటరైన దగ్గరి నుంచి కథలో సస్పెన్స్, వేగం పెరుగుతుంది. హృతిక్‌తో ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ నటించారు. సరిగ్గా ఇంటర్వెల్‌కు ముందు తానెవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నది విక్రమ్‌కు చెప్పేస్తాడు కబీర్. ఆకాశంలో, రెండు విమానాలతో జరిగే యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఎన్టీఆర్- హృతిక్ ఈ ఫైట్ సీన్‌లో పోటీపడి నటించారు. అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్‌కు తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌‌ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ చేశాడు దర్శకుడు. కబీర్, విక్రమ్‌ల మైండ్ గేమ్, రా చీఫ్‌ విక్రాంత్ కావ్‌ వ్యూహాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. విక్రమ్ - కబీర్‌ల మధ్య హోరాహోరీ పోరు, ట్విస్టులతో క్లైమాక్స్‌ను ముగించారు. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్‌లు డ్యాన్స్‌లో పోటీలు పడ




యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే హృతిక్ రోషన్ అలవోకగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు. ఫస్టాఫ్‌లో రా నుంచి తప్పించుకునే ట్రైన్ సీన్, ఇంటర్వెల్‌లో ఫ్లైట్ మీద జరిగే యాక్షన్ సీన్‌లలో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను గుర్తుచేశాడు. ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే.. హృతిక్‌కు గట్టిపోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో ఏడిపించేశాడు. హీరోయిన్ కియారా అద్వానీ బికినీ, లిప్‌లాక్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ తనలోని మరో షేడ్‌ను చూపించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు. టెక్నికల్ అంశాల జోలికి వస్తే ఈ సినిమాకు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా నిలిచింది. యాక్షన్ సీక్వెన్స్‌లను బెంజమిన్ జాస్ఫర్ అద్భుతంగా చూపించి మనల్ని మరో లోకంగా తీసుకెళ్లిపోయాడు. నిర్మాణ విలువల పరంగా ఆదిత్య చోప్రా ఎక్కడా తగ్గకుండా చాలా గ్రాండీయర్‌గా వార్ 2ను నిర్మించారు.

No comments: